కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలోని మేకల శివుడు అనే వ్యక్తి రేకుల ఇంటి వద్ద ఒకే చోట 12 పాములు కనిపించాయి. దీంతో శివుడు అదే గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ జగన్ కు సమాచారం ఇచ్చాడు. అతను 12 పాములను పట్టుకొని అడవిలో వదిలేశాడు. ఒకే ఇంటిలో ఇన్ని పాములు కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు
