
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియాశెట్టి వివాహనికి సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర, ఖండాలాలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు వీరి వివాహం జరగనుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే ఈ వేడుకకు 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది.
వివాహ తంతు పూర్తయ్యాక సాయంత్రం 6 గంటల సమయంలో కొత్త జంట మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబోయే వధూవరులకు ఆదివారం ఉదయం మెహందీ, సాయంత్రం సంగీత్ నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్, అతియా శెట్టి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.