
ఎంత గొప్పోడైనా.. మూత్రం వచ్చినప్పుడు పోసుకోకుండా ఆగుతాడా..! మీరు చెప్పండి.. ఆగం.. ఆగలేము. ఓ ఫుట్‌బాలర్ సైతం అచ్చం అలానే వచ్చేస్తోందని ఆపుకోలేకపోయాడు. చుట్టూ ప్రేక్షకులు ఉన్నా.. పదడుగుల దూరం గోల్ పాయింట్ ఉన్నా.. మైదానంలోనే ఓ పక్కన పని కానిచ్చేశాడు. ఆ అపూర్వ దృశ్యం కాస్తా రిఫరీ కంట పడటంతో అతని పాపం పండింది.
సోమవారం అట్లెటికో అవాజున్, కాంటోర్సిల్లో క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అవాజున్ ఫుట్‌బాలర్ సెబాస్టియన్ మునోజ్ మైదానంలోనే మూత్ర విసర్జన చేశాడు. మ్యాచ్ 71వ నిమిషంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
71వ నిమిషంలో అవాజున్‌కు కార్నర్ లభించింది. అదే సమయంలో గోల్ కీపర్ లుచో రూయిజ్ పెనాల్టీ ఏరియాలో వైద్య సహాయం అందుకోగా, అవాజున్ ఆటగాడు సెబాస్టియన్ మునోజ్ కార్నర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో గోల్ కీపర్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని గ్రహించిన మునోజ్.. వస్తున్న మూత్రాన్ని ఆపుకోలేక పక్కకెళ్లి పని కానిచ్ఛేశాడు. ఆ దృశ్యకావ్యాన్ని చూసి కోపం పట్టలేక అంపైర్ అతనికి రెడ్ కార్డ్ సూచించాడు. ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
?? ??́???? ???????????? ????? ??????́ ?? ??????????
— Miguel Ángel García (@Miguelin_24_) August 18, 2024
?? Cantorcillo vs Atlético Awajun de Copa Perú
? Sebastián Muñoz (Atlético Awajun) es expulsado ¡¡por ponerse a orinar en el saque de esquina en pleno partido!! pic.twitter.com/Blve6VFIGS
ఫుట్‌బాలర్ చర్యలను నెటిజన్స్ సమర్థిస్తున్నారు. వచ్చినప్పుడు పోసుకోవడం సమంజసమేనని అతన్ని వెనకేసుకొస్తున్నారు. పైగా 'మైదానంలో మూత్ర విసర్జన చేయకూడదని నిర్దిష్ట నియమం ఉందా?' అని ప్రశ్నిస్తున్నారు.