
పుణె: ఇండియా టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్.. టాటా ఓపెన్ మహారాష్ట్ర టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 7–5తో మటియా బెలుచి (ఇటలీ)పై నెగ్గాడు. గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ స్థాయి మేరకు రాణించాడు.
మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ 1–6, 4–6తో ఎలియాస్ యామెర్ (స్వీడన్) చేతిలో ఓడిపోయాడు. సౌత్ ఆసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 ఈవెంట్ ఇది. సోమవారం నుంచి మెయిన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. తొలి రౌండ్లో నగాల్.. వరల్డ్ 54వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)తో తలపడనున్నాడు. శశికుమార్ ముకుంద్.. ఫ్లావియో కొబోలితో, రామ్‌కుమార్.. పెడ్రో మార్టినేజ్ (స్పెయిన్)తో, మనాస్ దామి.. మైకేల్ మోహ్ (అమెరికా)ను ఎదుర్కొంటారు. డబుల్స్‌లో అంచనాలున్న రోహన్ బోపన్న, రామ్‌కుమార్.. వేర్వేరు పార్ట్‌నర్స్‌తో కలిసి బరిలోకి దిగుతున్నారు.