బీసీ కులాల రక్షణకు అట్రాసిటీ యాక్ట్ తేవాలి : తీగల ప్రదీప్

 బీసీ కులాల రక్షణకు అట్రాసిటీ యాక్ట్ తేవాలి :  తీగల ప్రదీప్
  • బీసీ రక్షణ సమితి అధ్యక్షుడు తీగల ప్రదీప్

ఖైరతాబాద్, వెలుగు: బీసీ కులాల రక్షణకు అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని బీసీ రక్షణ సమితి అధ్యక్షుడు తీగల ప్రదీప్​ గౌడ్ అన్నారు. మహాజన సోషలిస్ట్​పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడిగాఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో కీలక పాత్ర పోషించానని చెప్పారు. ఆ పార్టీకి రాజీనామాచేసి  బీసీ రక్షణ సమితిని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. మంగళవారం  సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ అట్రాసిటీ వలన ఎక్కువగా కేసులు ఎదుర్కొన్నవారంతా బీసీలేనని వెల్లడించారు.

అందుకే బీసీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం పదవులు దక్కాలని ..కొత్త  ప్రభుత్వంలో బీసీకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆయన కోరారు. నాయకుల తప్పిదాలతో బీసీల్లో ఐకమత్యం సాధ్యం కావడం లేదన్నారు.  సమావేశంలో రాజమౌళి, రాంచందర్,  గట్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

 
 

BC Defense Committee