డాక్టర్లపై దాడులను అరికట్టాలి: డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్

డాక్టర్లపై దాడులను అరికట్టాలి: డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్

పద్మారావునగర్, వెలుగు: డాక్టర్లపై దాడులను అరికట్టాలని సికింద్రాబాద్​గాంధీ ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) గాంధీ ఆసుపత్రి యూనిట్​డిమాండ్​ చేసింది. మహబూబాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్​శ్రీనివాస్‎పై జరిగిన దాడిని ఖండించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీజీడీఏ గాంధీ యూనిట్​ప్రెసిడెంట్ డాక్టర్​భూపేందర్​సింగ్ రాథోడ్​మాట్లాడారు. దాడి ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

డాక్టర్లు ప్రతీ రోగి ప్రాణాన్ని కాపాడేందుకే కృషి చేస్తారని, ఎవరూ ఉద్దేశ్యపూర్వకంగా హాని తలపెట్టబోరని అన్నారు. డాక్టర్‎లపై హింసాత్మక చర్యలు సమాజానికి మంచిది కాదన్నారు. సమావేశంలో టీజీజీడీఏ గాంధీ యూనిట్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్బయ్య , కోశాధికారి డాక్టర్ రవి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మురళి, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ వెంకటమణి, డాక్టర్ సుబోధ్, డాక్టర్ రాజేశ్​ పాల్గొన్నారు.