అత్తాపూర్ లో అగ్నిప్రమాదం.. కారు షోరూం సర్వీస్ సెంటర్ లో చెలరేగిన మంటలు 

అత్తాపూర్ లో అగ్నిప్రమాదం.. కారు షోరూం సర్వీస్ సెంటర్ లో చెలరేగిన మంటలు 

రంగారెడ్డి జిల్లా  అత్తాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ లోని  ఓ కారు  షోరూం సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సర్వీస్ సెంటర్ స్కాప్ గోడౌన్ నుంచి మంటలు చెలరేగి కార్లు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడం గమనించిన పక్క అపార్టుమెంటు వాసులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. 

మంగళవారం(ఫిబ్రవరి 10)  తెల్లవారు జామున రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్  పిల్లర్ నం 185 దగ్గర ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్ కారు షోరూం సర్వీస్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షోరూం వెనకాల కార్ల సర్వీసింగ్ సెంటర్లో ఉన్న మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.  ప్రమాదంలో సమయంలో సర్వీసింగ్ సెంటర్లో 50 కార్లు ఉన్నట్లు సమాచారం. 

షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఎవరో నిప్పంటించారని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఘటన ఎలా జరిగింది.. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.