చాక్లెట్ కోసం వెళ్లిన 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

V6 Velugu Posted on Sep 28, 2021

  • ఆటో పక్కన దాపుకు తీసుకెళ్లి చేతులు కట్టేసి అత్యాచారయత్నం.. చిన్నారి కేకలు వేయడంతో పారిపోయేయత్నం
  • నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • ముషీరాబాద్ పరిధిలోని పార్శిగుట్టలో ఘటన

హైదరాబాద్: చాక్లెట్ కోసం వెళ్తున్న ఏడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. చాక్లెట్ ఆశ చూపి.. ఆటో పక్కన దాపుకు తీసుకెళ్లి చేతులు కట్టేసి.. నోరు మూసి అత్యాచారయత్నం చేయగా.. చిన్నారి భయంతో కేకలు వేసింది. చిన్నారి కేకలు విన్న స్థానికులు పరిగెత్తుకుంటూ రావడంతో నిందితుడు పారిపోయేయత్నం చేయగా.. స్థానికులు వెంటపడి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం ముషీరాబాద్ పరిధిలోని పార్శిగుట్టలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
పార్సిగుట్టలో ఏడేళ్ల చిన్నారి చాక్లెట్ కోసం వెళ్తుంటే వెంట ఎవరూ లేరని గుర్తించిన నిందితుడు చిన్నారితో మాటలు కలిపి ఆటో పక్కకు తీసుకెళ్లాడు. ఆటోను దాపుగా చేసుకుని బాలిక చేతులు కట్టేసి, నోరు మూసేసి ఆపై అత్యాచార యత్నం చేయగా.. బాలిక కేకలు వేసింది. బాలిక ఏడ్పును విన్న బస్తీ వాసులు వెంటనే వచ్చి చూడగా నిందితుడు దారుణం బయటపడింది. పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంటబడి పట్టుకున్నారు. నిందితుడు సీతాఫల్ మండికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు మల్లికార్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు అతనిపై 366,354,352ఏ, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Tagged Hyderabad, secunderabad, Musheerabad, parshigutta, , mushirabad ps, accused mallikarjun, rape attempt on 7years girl, attempt rape on minor girl

Latest Videos

Subscribe Now

More News