ప్రారంభమైన బొగ్గు గనుల వేలం

ప్రారంభమైన బొగ్గు గనుల వేలం

దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గనుల శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు డిప్యూటీ సీఎం భట్టి. 

శ్రావణపల్లి గనిని సింగరేణికే ఇవ్వాలన్నారు. తెలంగాణలోని పరిస్థితులు కిషన్ రెడ్డికి బాగా తెలుసన్నారు భట్టి. గత ప్రభుత్వం తప్పిదాలతో సింగరేణి సంస్థ రెండు సార్లు వేలంలో పాల్గొనలేదని చెప్పారు.