రెండు నగరాల పేర్ల మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రెండు నగరాల పేర్ల మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా పేరు మార్చేందుకు ఓకే చెప్పింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలను ఆయన షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరాల మార్పుపై తమకెలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. 

ఈ రెండు నగరాల పేర్లు మార్చాలని పలువురు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ను ఎలక్షన్ హామీలుగా ప్రకటించిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఉద్ధవ్‌ ఠాక్రే మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడానికి ముందు ఈ రెండు నగరాల పేర్లను మారుస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తాజాగా నగరాల పేర్లు మార్పు మారుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.