మూనీ.. మెరిసెన్‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియా ఘన విజయం.. పాకిస్తాన్‌‌కు మూడో ఓటమి

మూనీ.. మెరిసెన్‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియా ఘన విజయం.. పాకిస్తాన్‌‌కు మూడో ఓటమి

కొలంబో: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (109) సెంచరీకి తోడు అలనా కింగ్‌‌‌‌‌‌‌‌ (51 నాటౌట్‌‌‌‌‌‌‌‌) చెలరేగడంతో.. ఐసీసీ విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కిమ్‌‌‌‌‌‌‌‌ గార్త్‌‌‌‌‌‌‌‌ (3/14), మేఘన్‌‌‌‌‌‌‌‌ షుట్‌‌‌‌‌‌‌‌ (2/25), అనాబెల్‌‌‌‌‌‌‌‌ సదర్లాండ్‌‌‌‌‌‌‌‌ (2/15) రాణించడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ 107 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. 

దాంతో ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో రెండు గెలిచి ఐదు పాయింట్లు సాధించిన కంగారూలు టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. పాక్‌‌‌‌‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ ఓటమితో అట్టడుగు స్థానానికి పడిపోయారు. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 221/9 స్కోరు చేసింది. ఆరంభంలో పాక్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు బెంబేలెత్తారు. 

ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో మూనీ స్థిరంగా ఆడినా అలీసా హీలీ (20), లిచ్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ (10), ఎలీస్‌‌‌‌‌‌‌‌ పెర్రీ (5), సదర్లాండ్‌‌‌‌‌‌‌‌ (1), ఆష్లే గార్డ్‌‌నర్ (1), తహ్లియా మెక్‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌ (5), జార్జియా వారెహామ్‌‌‌‌‌‌‌‌ (0), కిమ్‌‌‌‌‌‌‌‌ గార్త్‌‌‌‌‌‌‌‌ (11) నిరాశపర్చారు. ఫలితంగా ఆసీస్‌‌‌‌‌‌‌‌ 115/8తో కష్టాల్లో పడింది. ఈ దశలో మూనీ, కింగ్‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 106 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. 

నష్రా సంధు 3, ఫాతిమా సనా, రమీన్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత పాక్‌‌‌‌‌‌‌‌ 36.3 ఓవర్లలో 114 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. సిద్రా అమిన్‌‌‌‌‌‌‌‌ (35) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. రమీన్‌‌‌‌‌‌‌‌ (15), ఫాతిమా సనా (11), నష్రా సంధు (11)తో సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. బెత్‌‌‌‌‌‌‌‌ మూనీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.