రెండో రోజు ఆస్ట్రేలియా 116/2 ..పాకిస్తాన్‌‌తో మ్యాచ్

రెండో రోజు ఆస్ట్రేలియా 116/2 ..పాకిస్తాన్‌‌తో మ్యాచ్

సిడ్నీ : పాకిస్తాన్‌‌తో  సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌‌లో జరుగుతున్న తన ఫేర్‌‌‌‌వెల్‌‌ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 34 రన్స్‌‌కే ఔటయ్యాడు. గురువారం, రెండో రోజు ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 6/0తో ఆట కొనసాగించిన ఆసీస్ వర్షం, వెలుతురు లేకపోవడంతో ఆట ముగిసే సమయానికి  తొలి ఇన్నింగ్స్‌‌లో116/2 స్కోరు చేసింది. 

అఘా సల్మాన్‌‌ బౌలింగ్‌‌లో స్లిప్‌‌లో బాబర్‌‌‌‌ ఆజమ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి వార్నర్ ఔటవగా.. ఉస్మాన్ ఖవాజా (47)ను ఆమెర్ జమల్‌‌ పెవిలియన్‌‌ చేర్చాడు. ప్రస్తుతం లబుషేన్ (23 బ్యాటింగ్‌‌), స్టీవ్ స్మిత్ (6 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రెండో రోజు46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి ఇన్నింగ్స్‌‌లో పాక్‌‌ 313 స్కోరుకు ఆలౌటవగా.. ఆసీస్‌‌ ఇంకా 197 రన్స్‌‌ వెనుకంజలో ఉంది.