ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన తొలి మహిళ

ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన తొలి మహిళ

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం జరిగింది. ఒకే ఒలింపిక్స్‌లో ఓ మహిళా స్విమ్మర్ ఏకంగా ఏడు పతకాలు సాధించింది. దాంతో ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన తొలి మహిళగా ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్‌కియోన్ రికార్డు సృష్టించింది.

ఒలింపిక్స్‌లో ఆదివారం మహిళల 4x100 మీటర్ల పోటీ జరిగింది. ఈ పోటీలో అమెరికన్ జట్టును ఓడించి.. ఎమ్మా మెక్‌కన్ గోల్డ్ మెడల్ దక్కించుకోని ఈ చరిత్ర సృష్టించింది. ఈ పోటీలో మెక్‌కన్ జట్టు సభ్యులైన కెలీ మెక్‌కౌన్, చెల్సియా హోడ్జెస్, ఎమ్మా మెక్‌కీన్ మరియు కేట్ కాంప్‌బెల్‌లు సంయుక్తంగా అమెరికా మరియు కెనడాలను ఓడించారు. అమెరికా 3:51.73, కెనడా 3:52.60లో లక్ష్యాన్ని చేరుకుంటే.. ఈ ఆస్ట్రేలియన్ జట్టు మాత్రం 3:52.60 సెకన్లలో చేరుకొని సరికొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పింది. కాగా.. టోక్యోలో మెక్‌కియోన్ ఈ పతకం ఏడవది కావడం విశేషం. ఈ ఒక్క ఒలింపిక్స్‌లోనే మెక్‌కియోన్ ఏడు పతకాలు సాధించింది. ఈ ఘనతను ఏ మహిళా స్విమ్మర్ ఇప్పటివరకు అందుకోలేదు. 

టోక్యో ఒలింపిక్స్‌లో ఈ 27 ఏళ్ల మెక్‌కియోన్ మూడు కాంస్యాలతో పాటు నాలుగో స్వర్ణ పతకాలను సాధించింది. గతంలో తూర్పు జర్మనీకి చెందిన క్రిస్టిన్ ఒట్టో 1952లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆరు పతకాలను సాధించింది. 

ఈ ఒలింపిక్స్‌లో మెక్‌కియోన్ 50 మీటర్ల ఫ్రీస్టైల్, 4x100మీటర్ల ఫ్రీస్టైల్ రిలే, 100 మీటర్ల బటర్ ఫ్లై, 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే, 4x100 మీటర్ల మిశ్రమ మెడ్లే రిలే, 100 మీటర్ల ఫ్రీస్టైల్, 4x100మీటర్ల బటర్ ఫ్లై లో కాంస్య పతకాలు సాధించింది.

మెక్‌కియోన్ కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు మరియు నాలుగు కాంస్యాలు సాధించింది. మొత్తంగా 11 పతకాలు సాధించింది. దాంతో ఆస్ట్రేలియాకు ఒలింపిక్స్‌లో అత్యధికంగా పతకాలు తెచ్చిన ప్లేయర్‌గా నిలిచింది. మెక్‌కియోన్ తర్వాత గ్రేట్స్ థోర్ప్ (ఐదు బంగారం, మూడు రజతాలు, ఒక కాంస్యం) మరియు లీసెల్ జోన్స్ (మూడు బంగారం, ఐదు రజతాలు, ఒక కాంస్యం) తొమ్మిది ఒలింపిక్ పతకాలతో రెండు, మూడు స్థానాలలో ఉన్నారు.

మరిన్ని వార్తలు