తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ: కేటీఆర్

తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ: కేటీఆర్

తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ .. ఈ నేల మేలుకోరే భూమి పుత్రుల పార్టీ బీఆర్ఎస్  అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ ల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్ . పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ప్రజల గొంతుకను అనేక చట్టసభల్లో వినిపించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ సాకారమైందన్నారు.  తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. 

తెలంగాణ సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు వ్యాపించాలన్న ఆశయంతోనే బీఆర్ఎస్ గా పేరు మార్చి జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పారు. జెండా మోసి..జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం..బలగం అని అన్నారు. ఎదురుదెబ్బలకు బెదిరిపోలేదన్నారు. గెలిస్తే పొంగిపోలేదు..ఓటములకు కుంగిపోలేదన్నారు కేటీఆర్ .ఏ పాత్రలో వున్నా జనమే ఎజెండా అని చెప్పారు.