విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.27.60 లక్షల మోసం..మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.27.60 లక్షల మోసం..మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఏడుగురిని నమ్మించి రూ.లక్షలు దోచుకున్నారు. వారిపై హైదరాబాద్​మధురానగర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో ఉండే నవీన్ అనే వ్యక్తికి వీరమాచినేని మన్సూరత్ చౌదరి, అతడి ఫ్రెండ్ రాఘవ పరిచయమయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారు నవీన్‌‌‌‌తో పాటు మరో ఆరుగురిని నమ్మించారు

 ఆన్‌‌‌‌లైన్ లావాదేవీల ద్వారా ఆ ఏడుగురి నుంచి మొత్తం రూ.27.60 లక్షలు పలు దఫాల్లో తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగాల గురించి అడిగితే తప్పించుకుంటూ వస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరడంతో దూషించి, బెదిరించారు. దీంతో మోసపోయినట్లు భావించిన నవీన్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.