హన్మకొండలో నకిలీ క్లీనిక్​లను గుర్తించిన అధికారులు

హన్మకొండలో నకిలీ క్లీనిక్​లను గుర్తించిన అధికారులు
  • డాక్టర్ల పై కేసులు నమోదు

గ్రేటర్ వరంగల్, వెలుగు: హన్మకొండ సిటీలో పలు నకిలీ క్లీనిక్​లను గుర్తించి, డాక్టర్లపై కేసులు నమోదు చేశారు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు. శుక్రవారం సిటీలోని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​వో మదన్ మోహన్ మాట్లాడుతూ హన్మకొండ టీఎస్​ఎంసీ చైర్మన్ డాక్టర్ మహేశ్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని ఊరుగొండ గాయత్రి హాస్పిటల్​లో నకిలీ డాక్టర్ వెంకట్రాములు, రెడ్డి కాలనీలో ఫస్ట్ ఎయిడ్​ సెంటర్​లో నకిలీ డాక్టర్ సీహెచ్ భాస్కర్, రాజా రాజేశ్వర్ క్లినిక్​లో నకిలీ డాక్టర్ బత్తుల రాజుకుమార్, అంబేద్కర్ సెంటర్​లో గాయత్రి క్లినిక్​లో ఎ.లకృతి, లక్ష్మి క్లీలినిక్​లో టి.శ్రీనివాస్, బాలాజీ క్లీనిక్​లో ఆర్.శ్రీకాంత్, వెంకటేశ్వర్లు క్లీనిక్​లో లక్ష్మీనర్సింహా, ఫస్ట్ ఎయిడ్ సెంటర్​లో ఫార్మ్​ డీ చదివి డాక్టర్ అవతారం ఎత్తిన ప్రవీణ్, ఎం.శ్రీనివాస్ పై ఎఫ్​ఐఆర్ నమోదు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. 

హన్మకొండ నక్కలగుట్టలో హెయిర్ క్రియేషన్స్ సెంటర్​కు డీఎంహెచ్​వో నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని నోటీస్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ఐఎంఏ డాక్టర్లు అన్వార్​మియా, వెంకటస్వామి, అజీత్ పాషా ఉన్నారు. ఇదిలా ఉండగా, కాజీపేట, హన్మకొండ ప్రాంతాల్లోని పలు స్కానింగ్​ సెంటర్లను  డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్ యాకూబ్ పాషా , వైద్యాధికారులు అశోక్​రెడ్డి, మాధవ రెడ్డి పరిశీలించారు.