నేత్రకు ఒలింపిక్‌‌‌‌ బెర్త్‌‌‌‌

నేత్రకు ఒలింపిక్‌‌‌‌ బెర్త్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా సెయిలర్‌‌‌‌ నేత్ర కుమనన్‌‌‌‌ పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధించింది. ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌ (లాస్ట్‌‌‌‌ చాన్స్‌‌‌‌ రెగెట్టా)లో భాగంగా శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌ డింగీ (ఐఎల్‌‌‌‌సీఏ 6)లో నేత్ర 67 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. అయితే ఎమర్జింగ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ (ఈఎన్‌‌‌‌పీ)లో పోటీపడ్డ సెయిలర్లలో నేత్ర టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలవడంతో బెర్త్‌‌‌‌ కన్ఫామ్‌‌‌‌ అయ్యింది. సెయిలింగ్‌‌‌‌కు పెద్దగా ప్రాధాన్యత లేని దేశాల కోసం వరల్డ్‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌ బాడీ ఈ ప్రోగ్రామ్‌‌‌‌ను కండక్ట్‌‌‌‌ చేస్తోంది. ఎబ్రూ బోలాట్‌‌‌‌ (రొమేనియా 36 పాయింట్లు), మారిలెనా మార్కి (సైప్రస్‌‌‌‌ 37 పాయింట్లు), లిన్‌‌‌‌ ప్లెటికోస్‌‌‌‌ (స్లొవేనియా 54 పాయింట్లు) ఒలింపిక్‌‌‌‌ కోటాలను కైవసం చేసుకున్నారు. ఆరుసార్లు ఒలింపియన్‌‌‌‌ టటియానా డ్రోజ్‌‌‌‌డోవ్‌‌‌‌స్కాయా (59) ఫోర్త్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో ఒలింపిక్​ బెర్త్‌‌‌‌ను చేజార్చుకుంది.