ఆశలపై నీళ్లు చల్లారు : భారత్ పై ఆస్ట్రేలియా విక్టరీ

ఆశలపై నీళ్లు చల్లారు : భారత్ పై ఆస్ట్రేలియా విక్టరీ

బెంగళూరు: రెండో T20 మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. టీమిండియా ఇచ్చిన 190 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో చేజ్ చేసింది ఆసీస్. కంగారూ బ్యాట్స్ మెన్ లో మ్యాక్స్ వెల్ 55 బంతుల్లోనే 9 సిక్సర్లు, 7 ఫోర్లతో 113 పరుగులు చేసి ఆసీస్ ను గెలిపించాడు. హ్యాండ్స్ కంబ్ 20, షార్ట్ 40 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా… 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. రాహుల్ 47, ధవన్ 14, కోహ్లీ 72, ధోనీ 40 పరుగులు చేశారు. కార్తీక్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్ వెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో 2 T20ల సిరీస్ ను 2-0తో గెలుచుకుంది ఆస్ట్రేలియా. మార్చ్ 2న భారత్-ఆసీస్ మధ్య 5 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.