ఆస్ట్రేలియన్‌‌‌ ఓపెన్‌ ‌మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌: ఆయుష్‌ ‌‌సంచలనం

ఆస్ట్రేలియన్‌‌‌ ఓపెన్‌ ‌మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌: ఆయుష్‌ ‌‌సంచలనం

సిడ్నీ: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ షెట్టి.. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో అన్‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ 21–17, 21–16తో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ కొడాయ్‌‌‌‌‌‌‌‌ నరోకా (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. 68 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ర్యాలీలు, స్మాష్‌‌‌‌‌‌‌‌లతో చెలరేగాడు. తనకంటే అనుభవం ఎక్కువగా ఉన్న ప్లేయర్‌‌‌‌‌‌‌‌తో ఆడినా ఏమాత్రం ఒత్తిడి లేకుండా పాయింట్లు రాబట్టాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఏడోసీడ్‌‌‌‌‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ 21–17, 13–21, 21–13తో చి యు జెన్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) గెలిచాడు.

63 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయినా డిసైడర్స్‌‌‌‌‌‌‌‌లో చెలరేగాడు. ర్యాలీలు, స్మాష్‌‌‌‌‌‌‌‌లతో ఏకపక్షంగా మార్చేశాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 20–22, 16–21తో షోగో ఒగ్వా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, తరుణ్‌‌‌‌‌‌‌‌ 13–21, 21–19, 10–21తో లిన్‌‌‌‌‌‌‌‌ చున్‌‌‌‌‌‌‌‌ యి (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో, హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 19–21, 10–21తో అల్వి ఫర్హాన్‌‌‌‌‌‌‌‌ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ 21–18, 21–11తో సు చింగ్‌‌‌‌‌‌‌‌ హెంగ్‌‌‌‌‌‌‌‌–వు గువాన్‌‌‌‌‌‌‌‌ జిన్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై నెగ్గి ముందంజ వేశారు.