వేములవాడలో హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు

వేములవాడలో  హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఓ యువకుడు జూన్ 17న ఉదయం ఒ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన హిజ్రా పింకీ(22)తో  హైదరాబాద్ కు చెందిన  శ్రీనివాస్‌(23) కు స్నేహం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో మూడు ముళ్లతో ఒక్కటయ్యారు జంట.

హిజ్రా పింకీ, హైదరాబాద్ కు చెందిన  శ్రీనివాస్ 23 వేములవాడ రాజన్న సన్నిధిలో ఇవాళ  మూడుముళ్లతో ఒక్కటయ్యారు. డిగ్రీ వరకు   చదివిన శ్రీనివాస్, ప్రస్తుతం ఆటో నడుపుతు జీవనం సాగిస్తున్నాడు. ఈ వివాహానికి  సబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.