సాయం చేసినట్టే చేసి..10 లక్షలు కొట్టేశారు

సాయం చేసినట్టే చేసి..10 లక్షలు కొట్టేశారు
  • ఆటో డ్రైవర్​ అరెస్టు, పరారీలో మరో నిందితుడు

కూకట్​పల్లి, వెలుగు: నగదు చోరీ చేసిన కేసులో కేపీహెచ్​బీ పోలీసులు ఓ ఆటో డ్రైవర్​ను అరెస్టు చేశారు. అడ్డగుట్ట సొసైటీకి చెందిన  సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ ఉత్తమ్​కుమార్​వర్మ(31) తన కారులో రూ.10 లక్షలు పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. కేపీహెచ్​బీకాలనీ వద్ద కారు అదుపు తప్పి డివైడర్​ని ఢీకొట్టింది. 

ఆ సమయంలో అతని కారు వెనుక ఉన్న ఆటో డ్రైవర్​ ముదావత్​ శంకర్​(26), మరో యువకుడు అభినయ్​ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి ఉత్తమ్​కుమార్​ వర్మకు సాయం చేశారు. ప్రమాదానికి గురైన కారును సనత్​నగర్​లోని షోరూం వరకు తీసుకెళ్లగా తోడుగా వెళ్లారు. 

ఆ తరువాత ఆటోలో ఉత్తమ్​కుమార్​ వర్మను అడ్డగుట్ట సొసైటీలోని ఇంటి వద్ద దించారు. తెలివిగా వర్మ బ్యాగ్​ను వదిలి వెళ్లేటట్టు చేశారు. ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన వర్మ ఆటోడ్రైవర్​కి ఫోన్​ చేస్తే స్విచాఫ్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, శుక్రవారం ఆటో డ్రైవర్​ శంకర్​ను అదుపులోకి తీసుకున్నారు. రూ.5.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అభినయ్​ పరారీలో ఉన్నాడు.