జగద్గిరిగుట్టలో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్

జగద్గిరిగుట్టలో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్

హైదరాబాద్ లోని  జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల బాలుడిని  ఆటో డ్రైవర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఆటోతో వచ్చిన డ్రైవర్ బాలుడిని నమ్మించి పక్క వీధుల్లోకి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు.  స్థానికులు చూడటంతో  ఆ  డ్రైవర్ పరారయ్యాడు.  ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. 

అనంతరం బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.