ఆటో పర్మిట్ల జారీలో అక్రమాలు ...షోరూమ్స్ఓనర్లు, ఫైనాన్సర్లపై చర్యలు తీసుకోవాలి

ఆటో పర్మిట్ల జారీలో అక్రమాలు ...షోరూమ్స్ఓనర్లు, ఫైనాన్సర్లపై చర్యలు తీసుకోవాలి
  • తెలంగాణ టాక్సీ, డైవర్స్​యూనియన్ డిమాండ్​ 
  • ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నా

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆటోలను బ్లాక్ చేసి అక్రమంగా అమ్ముకుంటున్న షోరూమ్స్​ఓనర్లు, ఫైనాన్షియర్ల పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ, డ్రైవర్స్ యూనియన్ డిమాండ్​ చేసింది. సోమవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు. అడ్డదారిలో ఆటోలు అమ్ముకుంటూ షోరూమ్స్​ఓనర్లు, ఫైనాన్సర్లు తమ పొట్టకొడుతున్నారన్నారు. 

ఈ విషయంలో రవాణా శాఖ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలన్నారు. కమిషనర్ సురేంద్ర మోహన్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సీహెచ్ శివలింగయ్య, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 

ధర్నాలో బీపీటీఎంఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నంద కిషోర్, ఉపాధ్యక్షుడు ఎండీ హబీబ్, ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్, బీపీటీఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, వి.సమ్మయ్య యాదవ్, గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఎన్.కిషన్, అశ్విన్ రాజు, గిరి, బాబురాజ్, యు.రాములు, సాయిలు, జె.పరశురాం, వజ్రాలింగం పాల్గొన్నారు.