ప్రైవేటు జెట్ లు, చార్టర్డ్ విమానాలకు గ్రీన్ సిగ్నల్

ప్రైవేటు జెట్ లు, చార్టర్డ్ విమానాలకు గ్రీన్ సిగ్నల్

ప్రైవేటు జెట్ లు, చార్టర్డ్ విమానాలకు ఏవియేషన్ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో.. రాకపోకలు చేసుకోవచ్చని తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా.. ప్రైవేటు జెట్ లు, చార్డర్డ్ ఫ్లైట్ లు.. రెండు నెలలపాటు బంద్ అయ్యాయి. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ… జెట్ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

చార్టర్డ్ విమానాల ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్ పోర్టు.. లేదా హెలిప్యాడ్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జెట్, చార్డర్డ్ ఫ్లైట్ ప్రయాణాలకు దూరంగా ఉండాలి. నిబంధనల ప్రకారం చార్టర్డ్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలనీ.. ఎక్కువగా వసూలు చేయకూడదని ఏవియేషన్ శాఖ సూచించింది.