GT vs CSK: మోత మోగించిన మాత్రే.. ఒకే ఓవర్లో 28 పరుగులతో రెచ్చిపోయిన 17 ఏళ్ళ కుర్రాడు

GT vs CSK: మోత మోగించిన మాత్రే.. ఒకే ఓవర్లో 28 పరుగులతో రెచ్చిపోయిన 17 ఏళ్ళ కుర్రాడు

ఆదివారం (మే 25) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగి ఆడాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టి సంచలనంగా మారాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నై ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదిన ఈ 17 ఏళ్ళ కుర్రాడు.. నాలుగు ఐదు బంతులకు ఫోర్ కొట్టాడు. 

ALSO READ | IPL 2025: లక్నోతో మ్యాచ్‌కు రెడీ.. RCB జట్టులో చేరిన స్టార్ పేసర్

చివరి బంతికి ఫోర్ కొట్టి ఓవరాల్ గా ఒక్కడే ఈ ఓవర్లో 28 పరుగులు విధ్వంసం సృష్టించాడు. మాత్రే ధాటికి తొలి రెండు ఓవర్లలో చెన్నై 34 పరుగులు చేసింది. వేగంగా ఆడే ప్రయత్నంలో నాలుగో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన మాత్రే 17 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. మాత్రే ధాటికి అర్షద్ ఖాన్ ఒక్క ఓవర్ కే పరిమితమయ్యాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. దూబే (7), కాన్వే (27) క్రీజ్ లో ఉన్నారు. ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) వేగంగా మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ కు తలో వికెట్ దక్కింది.