
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ లో తన బెర్త్ విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని, దీని గురించి తానిప్పుడు ఏమీ మాట్లాడలేనని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైన అజారుద్దీన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా తన పేరును కేబినెట్ లో ఖరారు చేయడం ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నానని, అయితే హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. తనకు ముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పనిచేసిన అమేర్ అలీఖాన్ ను కలిశానని, ఆయన కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తనతో చెప్పారని పేర్కొన్నారు.