అక్టోబర్ 19 నుంచి బీ ఫార్మసీ అడ్మిషన్ కౌన్సెలింగ్

అక్టోబర్ 19 నుంచి బీ ఫార్మసీ అడ్మిషన్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 19 నుంచి ఎప్​సెట్ (ఎంపీసీ స్ర్టీమ్)  బీ ఫార్మసీ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్​ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ఈ నెల 19 నుంచి 22 వరకూ రిజిస్ర్టేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

 21 నుంచి 23 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 25 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. 28న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని తెలిపారు. నవంబర్ 4  నుంచి 12 వరకూ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు.