పతంజలి జీన్స్‌ ₹500

పతంజలి జీన్స్‌ ₹500

యోగా గురువు బాబా రామ్‌ దేవ్‌ కు చెందిన పతంజలి సంస్థ పరిధాన్‌ పేరుతో జీన్స్‌‌‌‌తోపాటు పలు వస్త్రా లను మార్కెట్ లో కి సోమవారం విడుదల చేసిం ది. ధన్‌ తేరాస్‌ పర్వదినాన్ని పురస్కరిం చుకొని రామ్‌ దేవ్‌ ఢిల్లీలో నిర్వహించి న కార్యక్రమంలో
రామ్‌ దేవ్‌ ‘పతంజలి పరిధాన్‌ ’ బట్టల దుకాణాన్నిప్రారంభించారు. ‘ఆస్థా’, ‘సంస్కార్‌‌‌‌’, ‘లైవ్‌ ఫిట్‌‌‌‌’బ్రాండ్స్‌‌‌‌ కింద మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం దాదాపు 3500 రకాల వస్త్రా లు, షూస్‌ , యాక్సెసరీస్‌ ను అందుబాటు లోకి తీసుకొచ్చారు . తొలి
బట్టల దుకాణాన్ని తెరిచినందుకు గాను పతంజలి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిం ది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25 శాతం డిస్కౌంట్‌‌‌‌ ఇస్తారు.పతంజలి జీన్స్‌‌‌‌ ధర రూ.500లు కాగా, రెం డు బ్రాండెడ్‌ షర్స్‌ట్ రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు.
‘‘ఖాదీ వస్త్రం స్వాతంత్య్రోద్యమానికి ప్రేరణ ఇచ్చినట్టు.. పతంజలి పరిధాన్ వస్త్రా లు మనదేశ ఆర్థిక స్వాతంత్య్రానికి బాటలు వేస్తాయి. దుస్తులు కేవలం వస్తువులే కావు.. మన ఆత్మగౌరవానికి గుర్తులు’’ అని రామ్‌ దేవ్‌ అన్నారు.