
మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాతగా మారారు. రేవంత్ రెడ్డి కూతురు నైమీషారెడ్డి గత వారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పంచుకున్నారు. ఈ సందర్బంగా మనవడితో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేవంత్ ట్వీట్‌కు ఆయన అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
'మా అమ్మాయి నైమీషా గతవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. మా మనవడి రాకతో మేము ఆశీర్వదించబడ్డామని మీతో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. బిడ్డకు, తల్లికి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను' అంటూ ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు చెబుతున్నారు.
ఏపీకి చెందిన బిజినెస్‌మెన్ సత్యనారాయణరెడ్డితో 2015లో నైమీషా పెళ్లి జరిగింది. ఏకైక కూతురు కావడంతో నైమీషా పెళ్లిని రేవంత్ గ్రాండ్‌గా నిర్వహించారు. అప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి ఇటీవలే రెండు నెలల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. పాదయాత్రకు వెళ్లే ముందు రేవంత్‌కు కూతురు నైమీషారెడ్డి తిలకం దిద్దారు. రెండు నెలల పాటు పలు నియోజకవర్గాల మీదుగా రేవంత్ పాదయాత్ర సాగింది.
https://twitter.com/revanth_anumula/status/1645044263066157057