కుక్కకు ఘనంగా సీమంతం..అతిధులకు విందు భోజనం

కుక్కకు ఘనంగా సీమంతం..అతిధులకు విందు భోజనం

కుక్క. అన్ని జంతువుల్లో కెల్లా అతి విశ్వాసం ఉన్నది అని చెప్తారు. అటువంటి కుక్కను ఓ ఫ్యామిలీ తమ ఇంటి మెంబర్ గా పెంచుకుంటున్నారు. దానిపై తమకున్న ప్రేమను నలుగురికి చాటి చెప్పారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీలోని నవకుమార్, ఆశా దంపతులు. ఏడాది క్రితం తెచ్చుకున్న కుక్కకు ఇంట్లో ఘనంగా శ్రీమంతం చేశారు నవకుమార్ కుటుంబ సభ్యులు. అల్లారు ముద్దుగా పెంచుకున్న స్టెఫీ శ్రీమంతానికి బంధు, మిత్రులను ఆహ్వానించారు. ఫంక్షన్ కు వచ్చిన మహిళలు స్టెఫీకి మంగళ హారతులు ఇచ్చారు. వచ్చిన అతిధులకు మంచి విందు భోజనం పెట్టారు నవకుమార్ దంపతులు..

see more news

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు