ఈ టీవీ సీరియల్స్ తగలెయ్యా... : కడుపులోని బిడ్డ ట్రాన్స్ ఫర్ కావటం ఏంట్రా..

ఈ టీవీ సీరియల్స్ తగలెయ్యా... : కడుపులోని బిడ్డ ట్రాన్స్ ఫర్ కావటం ఏంట్రా..

టీవీ సీరియల్స్.. ఇప్పుడు లిమిట్స్ దాటేశాయి.. వాళ్ల మేకింగ్ యూనివర్సల్ కు మించిపోయింది. ఎలాంటి ఐడియాలతో తీస్తున్నారంటే.. చివరికి కడుపులోని బిడ్డ కూడా మరో కడుపులోకి మారిపోయే విధంగా.. అది కూడా మ్యాజిక్ తో.. ఇంతకు మించిన పరాకాష్ట ఏమైనా ఉంటుందా.. ఓ ప్రముఖ ఛానెల్ లో వచ్చే ప్రముఖ సీరియల్ లోని ఈ సీన్ చూసిన తర్వాత.. నెటిజన్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు..  చంపేయండ్రా.. మమ్మల్ని చంపేయండీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే ప్రస్టేషన్ లో తలలు బాదుకుంటున్నారు. ఇంతకీ ఇంతటి ప్రస్టేటెడ్ తెప్పించిన సీరియల్ లోని సీన్ ఏంటో పూర్తిగా చూద్దామా...

స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే డైలీ సీరియల్ సోప్ యే జాదూ హై జిన్ కా టెలివిజన్ సీరియల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ సీరియల్ లో ప్రసారమయ్యే ఈ సీన్.. రోష్ని,షాయారీ అనే ఇద్దరు లేడీస్ తమ మధ్య మెరుస్తున్న తాడు లాంటి వస్తువు ద్వారా ఒకరి కడుపులోని బిడ్డ.. మరో అమ్మాయి కడుపులోకి వెళ్లటం చూపించారు. 

ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి కట్టిన తాడుతో..మరొకరి కడుపులోకి బిడ్డ మరొకరిలోకి వెళ్లినట్లు.. ఈ టీవీ సీరియల్ సీన్ తో నెటిజన్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అది కాక అక్కడ ఉన్న కో యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కు నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.పిచ్చి పీక్స్ లోకి వెళ్లినట్లు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

ఇప్పటికే డెవలప్ అవుతోన్నటెక్నాలజీ లో సరోగసీ ద్వారా పుట్టే పిల్లలను చూశాం. ఇక ఇంతలో ఇటువంటి సీరియల్ లో మాయ తాడుతో పుట్టడం ఇక కలియుగం అంతమే అంటున్నారు ఇండియన్ టీవీ షో ఫ్యాన్స్. మీ మ్యాజిక్ సరే కానీ, మీ పెర్ఫార్మన్స్ కు  నా బెస్ట్ విషెస్..ఇలాంటి మూర్ఖపు క్షణాలలో మీరింత సీరియస్‌గా ఎలా నటిస్తున్నారో..అంటూ కామెంట్ చేశారు.

ఇటువంటి సీన్స్ క్రియేట్ చేసిన క్రీయేటర్స్ కు నా బెస్ట్ విషెస్.. నేను 3 సంవత్సరాలు కోమాలో ఉన్నాను, ఇది టీవీలో ప్లే అవుతుండటం చూసి, నేనే లేచి మరి టీవీని ఆఫ్ చేసాను అని మరో నెటిజన్ కామెంట్ చేయటం.. మొత్తం స్టోరీకే హైలెట్ గా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అని నెటిజన్స్ ఆందోళనలో ఉన్నారు.