హన్వాడ, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామానికి చెందిన అతినమోని వెంకటయ్య(30)పై 2023లో లైంగికదాడి కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం మహబూబ్నగర్ మహిళా, 4 వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అఫ్రోజ్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నిందితుడికి 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించారు.
