
అర్జున అవార్డు గ్రహీత, స్టార్ షట్లర్ భమిడిపాటి సాయి ప్రణీత్ కాకినాడకు చెందిన శ్వేతను వివాహం చేసుకోబోతున్నాడు. బెంగళూరులో శ్వేత సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. హైదరాబాద్ లో సాయి, శ్వేతల ఎంగేజ్ మెంట్ శుక్రవారం రాత్రి రెండు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పెద్దలు కుదిర్చిన వారి వివాహం వచ్చే నెల 8న కాకినాడలో జరగనుంది. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నిశ్చితార్ధానికి బ్యాడ్మింటన్ దంపతులు కశ్యప్, సైనా తో పాటు, అశ్వనీ పొన్నప్ప ఇతర బ్యాడ్మింటన్ ప్లేయర్లు హాజరయ్యారు.