రైలులో వచ్చి బైక్​లు ఎత్తుకెళ్తున్రు

రైలులో వచ్చి  బైక్​లు ఎత్తుకెళ్తున్రు

 

  • ముగ్గురిని అరెస్ట్​ చేసిన  పోలీసులు
  • 27  బైకులు, ఆటో స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: రైల్లో వచ్చి రెక్కీ వేసి బైక్ లను ఎత్తుకెళ్లే ముఠాను బాలానగర్​సీసీఎస్, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​చేశారు. నిందితుల వద్ద 27 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ 22.20 లక్షలు ఉంటుంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్​కమిషనరేట్ లో బుధవారం సీపీ స్టీఫెన్​రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. వికారాబాద్​జిల్లా యాలాల్​మండలం కమల్​పూర్​కు చెందిన బోయిన శ్రీకాంత్​(22), మేదరి భాస్కర్(22) ఆటో డ్రైవర్లు. 

ఇదే మండలం నాగసముద్రానికి చెందిన మెట్టు శ్రీకాంత్(19) లేబర్. ముగ్గురూ కలిసి తాండూరు నుంచి హైదరాబాద్​కు రైలులో వచ్చి.. ముందుగా రెక్కీ వేసి కాలనీలు, బస్తీల్లో రాత్రిపూట పార్కింగ్​బైకులను మారు తాళాలతో తీసుకుని ఎత్తుకెళ్లేవారు. వాటిని తాండూరు, వికారాబాద్​తో పాటు తదితర ప్రాంతాల్లో అమ్మేవారు. హైదరాబాద్​, సైబరాబాద్​, వికారాబాద్​పరిధిలో 27 బైక్ లు, ఒక ఆటోను చోరీ చేశారు. పోలీసులు నిఘా పెట్టి ముగ్గురిని అరెస్ట్​చేశారు. సైబరాబాద్​, హైదరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో 15 కేసుల్లో నిందితులుగా ఉండగా, 2022లో అరెస్ట్​ అయి జైలుకు వెళ్లొచ్చినా  బైకు చోరీలను ఆపడంలేదని పోలీసులు తెలిపారు.