బాలాపూర్ గణపతి హుండీ ఆదాయం ఎన్ని లక్షలంటే?

బాలాపూర్ గణపతి హుండీ ఆదాయం ఎన్ని లక్షలంటే?

హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ కు విరాళాల వర్షం కురిసింది.  హుండీ ఆదాయం భారీగా వచ్చింది. రూ. 23 లక్షల ఆదాయం సమకూరింది. 
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యములో నిర్వహించిన గణేష్ నవరాత్రి  ఉత్సవాలలో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు.  హుండీ ద్వారా  రూ. 23 లక్షల 760  రూపాయలు వచ్చినట్లు తెలిపారు.
 
ఈ సారి బాలాపూర్ గణేశ్ లడ్డూ కూడా రికార్డ్ ధర పలికిన సంగతి తెలిసిందే. ఖర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ గౌడ్ వేలంలో రూ. 35లక్షలకు దక్కించుకున్నారు.  గత ఏడాది కంటే ఈ సారి రూ. 4 లక్షల 99 వేలు అధికంగా పలికింది. గత ఏడాది రూ. 30లక్షల వెయ్యి రూపాయలు పలికిన సంగతి తెలిసిందే..

►ALSO READ | హైదరాబాద్ లో రూ. 2 కోట్ల విలువైన రద్దైన పెద్ద నోట్లు పట్టివేత