
హైదరాబాద్ నారాయణ గూడలో భారీగా రద్దైన నోట్లను పట్టుకున్నారు పోలీసులు. శాంతి థియేటర్ ఎదురుగా కెనరా బ్యాంక్ దగ్గర ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం దగ్గర మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 3 బ్యాగులలో రద్దైన 500 , 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న నోట్ల విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని చెప్పారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులను నారాయణ గూడ పీఎస్ కు తరలించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
►ALSO READ | చెట్లు నరికినందుకు రూ. 20 లక్షల ఫైన్ ..ఎక్కడంటే.?
నవంబర్ 8, 2016 న రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటి ప్లేసులో ఆర్బీఐ 2 వేల నోట్లను ప్రవేశ పెట్టింది. తర్వాత 2023 మే 19న వీటిని కూడా వెనక్కి తీసుకుంది. అయితే ఇంకా రద్దైన రెండు వేల నోట్లు, 500 నోట్లు, వెయ్యి నోట్లు అక్కడక్కడ చలామణీ అవుతుండటం గమనార్హం.