
హైదరాబాద్ కూకట్ పల్లిలో అనుమతి లేకుండా చెట్లు నరికిందుకు భారీగా ఫైన్ విధించారు అటవీశాఖ అధికారులు. కూకట్ పల్లి పరిధిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలో చెట్లు నరికివేసినందుకు రూ. 20 లక్షల ఫైన్ వేశారు అధికారులు.
గతవారం ఆ కంపెనీ పరిధిలో చెట్లు నరికివేతపై స్థానికులు అటవీ అధికారులకు సమాచారంఅందించారు.. దీనిపై విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులు అనుమతులు లేకుండా చెట్ల నరికివేసినందుకు కంపెనీ యాజమాన్యానికి 20 లక్షల రూపాయల జరిమానాను విధించారు. సెప్టెంబర్ 8న కంపెనీ యాజమాన్యం అటవీ శాఖకు 20 లక్షల రూపాయలను చలాన్ రూపంలో చెల్లించిందని మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు.. అనుమతులు లేకుండా ఎవరూ చెట్లు నరికివేతకు పాల్పడవద్దని హెచ్చరించారు.. జరిమానాతో పాటుగా కేసు కూడా నమోదు చేస్తామని తెలిపారు.
సిద్దిపేటలో లక్ష ఫైన్
ఆగస్టు 12న సిద్దిపేట పట్టణంలో అనుమతులు లేకుండా చెట్లు నరికినందుకు మున్సిపల్ అధికారులు లక్ష ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.. పట్టణంలోని హోసింగ్ బోర్డు ప్రాంతంలో ఐదు చెట్లు నరికినందుకుగాను ఒక్కో చెట్టుకు రూ. 20వేల చొప్పున మొత్తం లక్ష రూపాయల జరిమానా వేస్తూ మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
►ALSO READ | తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన