
బీజేపీ తెలంగాణ కమిటీని ప్రకటించింది. 8 మందికి వైస్ ప్రెసిడెంట్లుగా..ముగ్గురికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చింది. వీరితో పాటు 8 మందిని కార్యదర్శులుగా నియమించింది బీజేపీ. ఒకరికి ట్రెజరర్, మరొకరు జాయింట్ ట్రెజరర్ గా నియమించింది.
వైస్ ప్రెసిడెంట్లుగా బూరనర్సయ్య గౌడ్, కాశం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతి కుమార్, జయశ్రీ, కొల్లి మాధవి, గోపి, రాఘునాథ్ రావు, బండ కార్తీక రెడ్డిలను నియమించారు. ఇక ముగ్గురు గౌతమ్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్ లను ప్రధాన కార్యదర్శులుగా నియమించింది బీజేపీ
మహిళా మోర్చ అధ్యక్షురాలిగా మేకల శిల్పా రెడ్డి, యువ మోర్చ అధ్యక్షురాలిగా గణేశ్ కుండె, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బస్వాపురం లక్ష్మీనర్సింహా, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా క్రాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నేనావత్ రవి నాయక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగన్మోహన్ సింగ్ ను నియమించింది బీజేపీ.
►ALSO READ | అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్: మంత్రి సీతక్క