భారత యువ జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా
అసలేం జరిగింది..?
ఆదివారం ఆట మొదలైన కొద్దిసేపటికే అంపైర్లు బంతిని మార్చారు. దానిపై భారత ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించగా.. ఉద్దేశ్యపూర్వంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీసినట్లు ఆరోపించాడు.
"మీరు బంతిని పాడుచేస్తే, మేము కొత్త బంతి ఇస్తాం. అంతే తప్ప ఏ విధమైన చర్చల్లేవ్.. ఆట కొనసాగించండి.." అని షవాన్ క్రెగ్.. భారత క్రికెటర్లతో అన్నాడు.
అతని మాటలకు చిర్రెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్ "ఇదేంటీ.. మేం ఈ బంతితో ఆడాలా? ఇది నిజంగా తెలివి తక్కువ పని.." అని అంపైర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
వెంటనే క్రెగ్.. ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి "నీ కారణంగానే బంతి పాడైంది. నువ్వే బంతిని గీరావ్ (స్క్రాచ్). అందువల్లే ఆకారం మారింది.. బంతి మార్చాల్సి వచ్చింది.." అని అన్నాడు. వీరి మాటలు స్టంప్స్ మైక్స్‌లో రికార్డ్ అయ్యాయి.
Also Read :- కన్నీళ్లు తన్నుకొచ్చాయి.. రిటైన్ చేసుకోలేదని యువ క్రికెటర్ ఏడుపు
అలాంటిదేమీ లేదన్న క్రికెట్ ఆస్ట్రేలియా
అయితే, ఈ ఆరోపణలను క్రికెట్ ఆస్ట్రేలియా కొట్టి పారేసింది. బాల్ ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టతనిచ్చింది. బంతి పూర్తిగా పాడైనందున.. మరో బంతి ఇవ్వాల్సి వచ్చినట్లు పేర్కొంది.
కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్ (103) సెంచరీ చేయగా.. దేవ్‌దత్ పడిక్కల్ (88) పరుగులు చేశాడు.
ఈ ఇరు జట్ల మధ్య నవంబర్ 7 నుంచి మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.