హైదరాబాద్, వెలుగు: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ దోస్తీ చేసుకుందని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. మంగళవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ సీట్ల విషయంలో రెండు పార్టీలు సర్దుబాటు చేసుకున్నాయని అన్నారు.
హైదరాబాద్-–మహబూబ్‌నగర్-–రంగారెడ్డి ఎమ్మెల్సీ సీటును బీజేపీకి, నల్గొండ-–వరంగల్-–ఖమ్మం సీటును బీఆర్ఎస్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. తెలంగాణపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించాలని డిమాండ్ చేశారు.
