
ఆకుల అఖిల్, దర్శిక మీనన్ జంటగా చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బాలుగాడి లవ్ స్టోరీ’. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆకుల మంజుల నిర్మించారు. ఆగస్టు 8న సినిమా విడుదల కానుంది.
ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. సెన్సార్ బోర్డ్ మెంబర్ సామల వేణు, నిర్మాత మహేంద్రనాధ్, హీరోయిన్ మేఘన, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మానిక్, డైరెక్టర్ తల్లాడ సాయి అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని నటీనటులు అన్నారు. ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ చెప్పాడు. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాతలు అన్నారు.