ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ర్యాలీలు, సభలపై నిషేధం

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ర్యాలీలు, సభలపై నిషేధం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సభలు, సమావేశాలపై జనవరి 2వ తేదీ వరకు నిషేధం విధించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు డీజీపీ తెలిపారు. ఆరోగ్య శాఖ సూచించిన విధంగా కోవిడ్ నిబంధనల్ని అమలు చేయనున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు.  ఎయిర్ పోర్టుల్లో టెస్టులు చేయడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తైందని, ఎవరైనా మిగిలి ఉంటే టీకా తీసుకోవాలని సూచించారు.