గొల్ల, కురుమలకు చేయూతనిచ్చాం : బండారి లక్ష్మారెడ్డి

గొల్ల, కురుమలకు చేయూతనిచ్చాం : బండారి లక్ష్మారెడ్డి
  • ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, వెలుగు : బీఆర్ఎస్ సర్కారు గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం చిలుకానగర్ డివిజన్ బీరప్పగూడలో కురుమ సంఘం అధ్యక్షుడు గోరిగ ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కురుమ సంఘ సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఉప్పల్ సెగ్మెంట్ లో బండారి లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. తమ మద్దతు ఆయనకే ఉంటుందని కురుమ సంఘం నేతలు ప్రకటించారు. అనంతరం బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

గొల్ల, కురుమల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. కులవృత్తులకు చేయూతనిచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను మూడోసారి సీఎంను చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గొరిక రమేశ్, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గోపు సదానంద్, మేకల భాస్కర్ రెడ్డి,  హమాలి శ్రీనివాస్, రఘు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.