
గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ కు బయలు దేరి వెళ్లారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని దత్తాత్రేయ నివాసానికి చేరుకున్న రాజ్ భవన్ అధికారులు… ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్ గా ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు దత్తాత్రేయ.