పంజాగుట్ట నిమ్స్ దగ్గర భారీ వర్షానికి విరిగి పడిన చెట్టు.. కారు జస్ట్ మిస్.. బైక్ తుక్కతుక్కు..

పంజాగుట్ట నిమ్స్ దగ్గర భారీ వర్షానికి విరిగి పడిన చెట్టు.. కారు జస్ట్ మిస్.. బైక్ తుక్కతుక్కు..

హైదరాబాద్ లో వర్షం భయంకరంగా కురుస్తోంది. సోమవారం (ఆగస్టు 04) మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో మొదలైన వాన.. సాయంత్రం అయినా కూడా వదలకుండా దంచికొడుతూనే ఉంది. వాన బీభత్సానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో మనిషిలోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు మునిగిపోయాయి. అమీర్ పేట్, మైత్రీవనం ఏరియాల్లో బస్టాప్ లోని కుర్చీలు కూడా మునిగిపోయేలా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

భారీ వర్షానికి పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి వెనుకవైపు పెద్ద చెట్టు విరిగిపడింది. పంజాగుట్ట-బంజారాహిల్స్ రూట్ లో నిమ్స్ వెను చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. చెట్టు విరిగి బైక్ మీద పడటంతో తుక్కుతుక్కు అయిపోయింది. బైక్ ఇకనుంచి ఉపయోగించలేని విధంగా మారిపోయింది.

 మరోవైపు వానకు మెల్లగా వెళ్తున్న కారు జస్ట్ మిస్సయ్యింది. కారు ముందలిభాగం బ్యానెట్ పై చెట్టు పడటంతో డ్రైవర్ సేఫ్ అయ్యాడు. కారు ముందుభాగం కాస్త డ్యామేజ్ అయ్యింది. పెద్ద ప్రమాదం తప్పడంతో మెల్లగా కారును వెనకకు తీసి ఊపిరి పీల్చుకున్నారు. 

నాంపల్లి స్టేషన్ రోడ్ లోని కామత్ హోటల్ లోకి  భారీగా వర్షపు నీరు చేరుకుంది. హోటల్ లో లంచ్ చేయడానికి వచ్చిన కస్టమర్లు ఇరుక్కుపోయారు. మరోవైపు కూకట్ పల్లి అల్విన్ కాలనీలో రోడ్లు నదుల్లా ప్రవహిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. వరదకు రెండు బైకులు కొట్టుకొచ్చాయంటే ఎంత వరద వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.