
డిస్కౌంట్ అనగానే ఎగేసుకుని వెళ్లేది ఇండియన్స్ మాత్రమే అని మనపై నిందలేస్తారు గానీ ఈ విషయంలో విదేశీయులు కూడా తక్కువ తినలేదు. లండన్లో వెలుగుచూసిన ఈ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఈస్ట్ లండన్లోని వైట్ చాపెల్ ప్రాంతంలో ఉన్న సెయిన్స్బరీ స్టోర్లో బాస్మతి రైస్పై డిస్కౌంట్ ప్రకటించారు. ఇంకేముంది.. ఈ డిస్కౌంట్ బాస్మతి రైస్ బ్యాగుల కోసం కస్టమర్లు భారీగా తరలివెళ్లారు. ఆషాడం కేజీ సేల్ అమ్మే క్లాత్ షోరూం మాదిరిగా స్టోర్ కస్టమర్లతో కిటకిటలాడింది. ఆడ లేదు. మగ లేదు. కొన్ని ఫౌండ్లు మిగుల్చుకోవచ్చనే కక్కుర్తితో ఒక్కొక్కరూ ఐదారు బాస్మతి బియ్యం సంచులు కొనుక్కుని వెళ్లారు. ఒక్కో రైస్ బ్యాగ్ ను డిస్కౌంట్పై 9.50 పౌండ్లకు అమ్మారు.
ఆ కస్టమర్ల హడావిడి చూస్తే మళ్లీ ఇక బాస్మతి బియ్యం దొరకవేమో అనేంతలా అన్నేసి సంచులు కొనుక్కెళ్లారు. కస్టమర్లు ఇలా రైస్ బ్యాగ్స్ తీసుకెళుతుంటే అక్కడే ఉన్న కొందరికి ఆశ్చర్యమేసి వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. ఈ విషయం ప్రపంచమంతా తెలిసిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తక్కువకొస్తున్నప్పుడు ఎన్ని కొనుక్కుంటే మాత్రం తప్పేంటని కొందరు అంటుంటే, కొన్ని పౌండ్లను మిగిలించుకోవడం కోసం వాళ్లను వాళ్లే అవమానించుకుంటున్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
2023లో కూడా పాశ్యాత్య దేశాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిషేధం విధించడంతో విదేశాల్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దాంతో ప్రవాస భారతీయుల్లో టెన్షన్ మొదలై ఓ నాలుగు బ్యాగులు కొని దాచుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మనవాళ్లు సూపర్ మార్కెట్ల ముందు ‘క్యూ’ కట్టిన దృశ్యాలు గుర్తుండే ఉంటాయి.
Also Read :600 ఏళ్ల తర్వాత మళ్ళీ పేలిన అగ్నిపర్వతం
ఇంకొందరేమో ఏదో పెద్ద కరువు వచ్చినట్టు ఫీలయ్యారు. కొన్ని సూపర్ మార్కెట్ల దగ్గర కొవిడ్ సమయంలో సరుకుల కోసం ఎగబడ్డట్టు బియ్యం కోసం ఎగబడ్డారు. ఆసియా దేశ ప్రజలకు అన్నం లేనిదే కడుపు నిండదు. ఏది తిన్నా తిన్నట్టు ఉండదు. నాలుగు అన్నం ముద్దలు తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది. అనేక దేశాల ఫుడ్ కల్చర్లో అన్నం కూడా భాగమే. లండన్లో తాజాగా వెలుగుచూసిన ఈ ఘటనలో కూడా బాస్మతి బియ్యంపై డిస్కౌంట్ ప్రకటించారని తెలిసి ఎగబడి కొన్నది కూడా ఆసియా దేశాల ప్రజలేనని ప్రచారం జరుగుతోంది.
People stockpile rice after a Sainsbury’s in Whitechapel put Laila Basmati rice on sale for £9.50 pic.twitter.com/fBQokKzk1e
— UB1UB2 West London (Southall) (@UB1UB2) August 2, 2025