శంకరపట్నం, వెలుగు: యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మొలంగూర్ సింగిల్ విండో ఆఫీస్ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. పట్టాదారు పాస్ బుక్‌తో ఆధార్, మొబైల్ నంబర్ లింక్ లేని, ఆండ్రాయిడ్ మొబైల్ లేని తాము ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ తో సంబంధం లేకుండా యూరియా బస్తాలు పంపిణీ చేయాలన్నారు.
ఏవో వెంకటేశ్, ఏఈవో అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అక్కడికక్కడే ఆధార్, మొబైల్ నంబర్ లింక్ చేశారు. యూరియా కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
