కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ మినహా జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫెయిల్ అయ్యారని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ విమర్శించారు. శనివారం సిటీలోని మీకోసం ఆఫీస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాక బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగినట్లు తమకు అనుమానం కలుగుతోందన్నారు. కార్పొరేషన్ లో బీజేపీ గెలిచిన 30 మంది కార్పొరేటర్లలో 11 మంది బీఆర్ఎస్ మాజీలేనని గుర్తు చేశారు. పదేండ్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కేంద్ర మంత్రి వారిని బీజేపీలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
