రష్యాలో భూకంపం: 600 ఏళ్ల తర్వాత మళ్ళీ పేలిన అగ్నిపర్వతం..

రష్యాలో భూకంపం: 600 ఏళ్ల తర్వాత మళ్ళీ పేలిన అగ్నిపర్వతం..

రష్యాలోని కమ్చట్కా దగ్గరలో ఉన్న క్రాషెన్నినికోవ్ ఓ భారీ అగ్నిపర్వతం 600 ఏళ్ల తర్వాత మళ్ళీ బద్దలైంది. అంతకుముందు ఈ అగ్నిపర్వతం 1550 ఏడాదిలో  పేలింది. ఈ అగ్నిపర్వతం పేలడంతో జనాభా లేని చోట మొత్తం బూడిద పొగ కమ్మేసింది. ఇప్పటివరకు ఏ ఒక్క ఇళ్లు కూడా బూడిదలో చిక్కుకోలేదు ఇంకా పెద్దగా ప్రాణనష్టం కూడా జరగలేదు. 

అగ్నిపర్వతం పేలిన తర్వాత : అగ్నిపర్వతం  పేలిన తర్వాత 6,000 మీటర్ల ఎత్తుకు అంటే సుమారు 19,700 అడుగుల పైకి బూడిద పొగ చేరుకుందని రష్యన్ అధికారులు అన్నారు. ఈ బూడిద పసిఫిక్ మహాసముద్రం వైపు వ్యాపిస్తోంది. ఈ అగ్నిపర్వతం  పేలుడు కారణంగా ప్రభుత్వం 'ఆరెంజ్' ఏవియేషన్ అలర్ట్ కోడ్‌ ఇచ్చింది. అంటే ఆకాశంలో నల్లటి బూడిద పోగ వల్ల  విమాన రాకపోకలకు సమస్యలు రావొచ్చు, అలాగే పైలట్లు జాగ్రత్తగా ఉండాలని  చెప్పారు. 

Also Read : ప్రధాని మోదీ ఫస్ట్ ఫిమేల్ బాడీగార్డ్

అగ్నిపర్వతం పేలడానికి కొన్ని రోజుల ముందు కమ్చట్కా దగ్గరలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం గడిచిన   సంవత్సరాలలో అత్యంత శక్తివంతమైనది. దీని తరువాత జపాన్, హవాయి, ఈక్వెడార్ వంటి దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యింది. భూకంపం తరువాత సునామీ అలలు రష్యాలోని సివియర్-కురిల్స్క్ షిప్ యార్డుకు చేరుకున్నాయి, దింతో  చేపల ప్రాసెసింగ్ కేంద్రం (ఫిషింగ్ ప్లాంట్) మునిగిపోయింది. 

ఈ క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం సుమారు మూడు రోజుల క్రితం బద్దలైంది. బుధవారం ముందు కమ్చట్కాలోని మరొక అగ్నిపర్వతం   కూడా బద్దలైంది. ఇది యూరప్, ఆసియాలో అత్యంత చురుగ్గా ఉన్న అగ్నిపర్వతం. అంటే 2000 సంవత్సరం నుండి 18 సార్లు బద్దలైంది. ప్రస్తుతం వచ్చిన భూకంపం ఈ అగ్నిపర్వతం  పేలడానికి  కారణమైందా అని నిపుణులు పరిశీలిస్తున్నారు. 

దొర్మట్ అగ్నిపర్వతం అంటే ఏమిటి? దొర్మట్ అగ్నిపర్వతం అంటే ప్రస్తుతం చురుకుగా లేని అగ్నిపర్వతం, కానీ భవిష్యత్తులో పేలడం  లేదా పేలే అవకాశం ఉంది. ఇది చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతం, కానీ పూర్తిగా చనిపోనిది. ఇలాంటి అగ్నిపర్వతాలను నిద్రాణమైన అగ్నిపర్వతాలు అని కూడా అంటారు.