చంద్రగుప్తుడు భారతదేశాన్ని పరిపాలించిన సుప్రసిద్ధ రాజులలో ఒకడు. మయూర (నెమలి)కి మోరియా లేక మౌర్య వంశానికి గల సంబంధం పురావస్తు సాక్ష్యంతో నిర్ద్వంద్వంగా నిరూపించబడింది. ‘నందగర్’ దగ్గర ఉన్న ఒక అశోక స్తంభం అడుగున మోరియాల లేక మౌర్యుల రాజ వంశ చిహ్నమైన నెమలి ఉంది. సాంచీలోని మహా స్థూపం మీద కొన్ని శిల్పాల్లో కూడా మౌర్య చిహ్నం కనిపిస్తుంది. అశోకుని జీవిత చరిత్రకు సంబంధించిన కథలను శిల్పాల రూపంలోకి అనువదించారు. మగధ సింహాసనాన్ని నందరాజును ఓడించి గెలుచుకున్నాడు చంద్రగుప్తుడు. మగధ సామ్రాజ్య విజయం తర్వాత సెల్యూకస్ పై గెలుపు, నంద సామ్రాజ్యంలో ఇంకా మిళితం కాని ఇండియా దక్షిణ ప్రాంతాలపై విజయం చేకూరాయి. అలెగ్జాండర్ మరణం తర్వాత అధికారం కోసం సైనికాధికారుల మధ్య జరిగిన పోరులో క్రీ.పూ. 305లో సింధూనదిని దాటిన అతనికి చంద్రగుప్తుని బలమైన రాజ్యం కనిపించింది.
దాంతో ఆయనతో అతనికి మంచి చేసుకోక తప్పలేదు. అతడు చంద్రగుప్తునికి నాలుగు గ్రీకు సంస్థానాలైన పరోపనిషదే (కాబూల్), అరియ (హీరత్), అరబోసియా (కాందహార్), ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ – బెలూచిస్థాన్లలో భాగమైన గెడ్రోసియాలను సమర్పించుకున్నాడు. చంద్రగుప్తుడు తన వంతుగా సెల్యూకస్‌కు 500 ఏనుగులను బహూకరించాడు. అవి అతనికి తన శత్రువులైన ఆంటిగోన్లతో యుద్ధానికి ఉపయోగపడ్డాయి. క్రీ.పూ. 303లో చేసుకున్న ఈ సంధి ద్వారా చంద్రగుప్తుడు, తన దేశపు హద్దులను పర్షియా దాకా వ్యాపింపజేసిన మొదటి భారతీయ రాజు అయ్యాడు. చంద్రగుప్తుడు దక్షిణ ప్రాంతాన్ని జయించటానికి పైన ఉదహరించిన ఫ్లూటార్క్ కథనం ప్రకారం చంద్రగుప్తుడు తన రాజ్యాధికారాన్ని వదిలేసి, మైసూర్‌లోని శ్రావణ బెళగొళలో ఒక సన్యాసిగా స్థిరపడ్డాడని తెలుస్తుంది.
- మేకల
మదన్మోహన్ రావు
కవి, రచయిత
